
Oscar 2025: నలుగురు దర్శకులు తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఫిలింకి ఆస్కార్ అవార్డు
97వ అకాడమీ అవార్డుల వేడుకలో పాలస్తీనా, ఇజ్రాయెల్ నేపథ్యంలో రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం 'నో అదర్ ల్యాండ్' ఆస్కార్ గెలుచుకుంది. ఈ డాక్యుమెంటరీ ఫిలింని బాసెల్ అద్రా, హమ్దాన్ బల్లాల్, యువల్ అబ్రహం, రాచెల్ స్జోర్ నలుగురు దర్శకులు రూపొందించారు.