
జగదభిరాముడు జానకమ్మల కళ్యాణ వైభోగం
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల వార్షిక కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తులు తరలి వచ్చి.. శ్రీ సీతా రాముల కళ్యాణ వేడుకను కనులారా తిలకించి తరించారు.