
Sabdham Movie: మా బాబాయ్ నాని.. ఆది పినిశెట్టి స్పీచ్
ఆది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘శబ్దం’. ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ‘వైశాలి’ తర్వాత ఆది, అరివళగన్ కాంబినేషన్‌లో రూపొందిన రెండో మూవీ ఇది. 7జీ ఫిల్మ్స్ సమర్పణలో శివ ఈ మూవీని నిర్మించారు. ఫిబ్రవరి 28న థియేటర్లలో సినిమా విడుదల సందర్భంగా హైదరబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. చీఫ్ గెస్ట్‌గా ఈవెంట్‌కి హాజరైన నానికి థ్యాంక్స్ చెప్పారు. వైశాలిలాగే శబ్దం కూడా ప్రేక్షకులను బాగా నచ్చుతుందని తెలిపారు.