
పాక్ పౌర విమానాలను అడ్డు పెట్టి కుట్ర..: PM నరేంద్ర మోదీ
Operation Sindoor: పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్ బేస్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలను నాశనం చేయడం లక్ష్యంగా భారత సాయుధ బలగాలు దాడులకు దిగినపుడు, పాక్ పౌర విమానాలను అడ్డుగా ఉంచే కుట్ర పన్నిందని ఆరోపించారు. అయినప్పటికీ, పౌర విమానాలకు హాని చేయకుండా లక్ష్యాలను విజృంభించి ధ్వంసం చేయడంలో భారత సైన్యం చూపిన నిపుణత తనకు గర్వకారణంగా ఉందన్నారు. భారత సైనికుల శక్తి, అంకితభావం ఈ విజయానికి కారణమని ప్రశంసించారు.