
శిక్షణ ముసుగులో భారీ అవినీతి.. 157కోట్లు స్వాహాకు యత్నం: MLC వరుదు కళ్యాణి
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు వృత్తి నైపూణ్యాలను అందించే కార్యక్రమాలను కూడా అవినీతి కల్పతరువులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీసీ, ఓబీసీ, కాపు మహిళలకు కుట్టుశిక్షణ, మిషన్ల పంపిణీ కార్యక్రమంలో తొలి విడతలో ఏకంగా రూ.157 కోట్లు దోచుకునేందుకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ శిక్షణ సంస్థలను కాదని, కూటమి నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు నిబంధనలకు విరుద్దంగా టెండర్లను కట్టబెట్టారని ఆరోపించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా మహిళలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి కోసం కేటాయించిన సొమ్మును సైతం కాజేస్తోందని ధ్వజమెత్తారు.