
హైదరాబాద్ వీధుల్లో ప్రపంచ సుందరీమణులు
హైదరాబాద్ చార్మినార్ వద్ద మిస్ వరల్డ్ 2025 అందాల భామలకు ఘన స్వాగతం లభించింది. 109 దేశాల నుండి వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారులను సంప్రదాయ మార్ఫా వాద్యాలతో ఆహ్వానించారు. హైదరాబాద్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చూపించడానికి ఈ సందర్శన ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం హైదరాబాద్ వీధులను ప్రపంచ సుందరీమణులు సందర్శించారు.