
సన్న బియ్యం పథకం: నారాయణగూడలో మంత్రి పొన్నం ప్రభాకర్ సహపంక్తి భోజనం
Hyderabad: తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ నారాయణగూడలో 'సన్న బియ్యం పథకం' లబ్ధిదారుల ఇంటిని సందర్శించారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, అధికారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఇది ముఖ్యమైనదని మంత్రి పేర్కొన్నారు.