
Manchu Manoj clarifies on Alligations: నా తప్పు లేదు.. నేను భయపడను
మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారలేదు. మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు మనోజ్, విష్ణుల మధ్య కొన్నాళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. మంచు మోహన్, విష్ణు- మనోజ్ పరస్పరం దాడులు కూడా చేసుకున్నారు. పలుమార్లు పోలీసు స్టేషన్ల వరకు పంచాయితీలు నడిచాయి. ఈ నేపథ్యలో తాజాగా మారోసారి మంచు ఫ్యామిలీలో రచ్చ రేగింది. తిరుపతి సమీపంలోని లేక్ వ్యాలీ రిసార్టులో మంచు మనోజ్ ఉండగా.. అర్ధరాత్రి వేళ పోలీసులు అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మనోజ్‌కు సూచించారు. అయితే, తాను ఎందుకు వెళ్లాలని మనోజ్ ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. భాకరాపేట పోలీసు స్టేషన్‌కి వచ్చి మనోజ్ నిరసన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై మంచు మనోజ్ క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశాడు.