
ఖోఖో బ్రెజిల్ కెప్టెన్ నికోలస్ ఇంటర్వ్యూ
న్యూ ఢిల్లీలో ఖోఖో ప్రపంచ కప్ 2025 టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. పురుషులు, మహిళల విభాగాల్లో వివిధ దేశాలకు చెందిన 29 జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభ మ్యాచ్ సందర్భంగా ఖోఖో బ్రెజిల్ మెన్స్ కెప్టెన్ నికోలస్ తదేయు Asianet Newsతో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రపంచ వేదికపై తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి తన జట్టు సంసిద్ధతను వ్యక్తం చేశాడు. ఈ టోర్నీలో బ్రెజిలియన్ జట్టు తమదైన ముద్ర వేయడానికి, ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచేందుకు ఆసక్తిగా ఉందని చెప్పాడు.