
నువ్వు, జగన్ జైలు పక్షులు.. కల్వకుంట్ల కవితకి జనసేన నేత కౌంటర్
ప్రజలకు సేవ చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ శంకర్ గౌడ్ అన్నారు. సినిమాల్లో సంపాదించిన కోట్లాది రూపాయలు సొంత డబ్బులతో పేద విద్యార్థులకు, రైతులకు సాయం చేసి అండగా నిలిచారని గుర్తు చేశారు. కల్వకుంట్ల కవిత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు పక్షులు అని విమర్శించారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.