
YS Viveka case: జగన్ ను రాజకీయంగా మసకబార్చాలనే బాబు కుట్ర: Perni Nani comments
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వాచ్‌మెన్ రంగయ్య మరణంపై పత్రికల్లో రాసిన కథనమంతా అబద్ధాలు, అర్ధ సత్యాలని, జగన్‌పై రాజకీయ కక్షతోనే తప్పుడు కథనం ప్రచురించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్ర చేశారని, అలా ఆయనను రాజకీయంగా మసకబార్చాలని చంద్రబాబుతో కలిసి వ్యూహం పన్నారని వైయస్ఆర్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ధ్వజమెత్తారు. పత్రికల్లో రాసినట్టు ఆ ఆరుగురు సాక్షులు కాదని, జగన్ డ్రైవర్, వైయస్ జగన్ మామను కూడా వారు ఆ జాబితాలో చేర్చారని ఆక్షేపించారు. కేవలం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపర్చేలా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని, నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు మొదలు ఇప్పటి వరకు ఓ పత్రికది అదే అనైతిక తంతు అని దుయ్యబట్టారు. చనిపోయే వరకు పోలీసుల భద్రత మధ్య వాచ్‌మెన్ రంగయ్య ఉన్నాడని.. అన్నీ తెలిసినా తప్పుడు సమాచారంతో జగన్‌పై విషం చిమ్మే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.