
ఉగ్రవాదాన్ని సహించేదే లేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీనగర్ విమానాశ్రయాన్ని సందర్శించి అక్కడి సదుపాయాలను సమీక్షించారు. అనంతరం నగరాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడారు. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభించినట్లు చెప్పారు. పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారని తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదం పట్ల తమకు ఎలాంటి సహనం లేదని స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు.