వీర జవాన్ మురళి నాయక్ పాడే మోసిన నారా లోకేష్ | Operation Sindoor | Ind Vs Pak | Asianet News Telugu
ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళి తండాకు చేరుకొని మురళీ నాయక్ ను కడసారి చూసి నివాళి అర్పించారు. అనంతరం మంత్రులు నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతకుముందు అమర జవాన్ మురళి నాయక్ పాడే మోసి కడసారి నివాళి సమర్పించారు.