తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి... పొగమంచులో పల్లె ప్రకృతి అందాలు చూడండి...
హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతోంది.
హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు మరింత పెరుగుతోంది. తెల్లవారుజామున గ్రామాల్లో కురుస్తున్న పొగమంచును చూస్తుంటే మనం ఏ కాశ్మీరో, సిమ్లాలోనో వున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇలా తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మంలోని ఏజన్సీ ప్రాంతాలతో పాటు ఏపీలోని గోదావరి జిల్లాలు, విశాఖ ఏజన్సీ ప్రాంతాల్లో పొగమంచులో ప్రకృతి అందాలు మరింత రమణీయంగా కనిపిస్తున్నారు. ఇక ఇరు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచులో ప్రయాణాలకు ప్రజలు బయపడిపోతున్నారు. కానీ ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ పొగమంచులో ప్రకృతి అందాలను వీక్షించేందుకే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చలికాలం కొందరికి ఆహ్లాదాన్ని పంచితే మరికొందరికి ఇబ్బందిపెడుతోంది. ఏది ఏమైనా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు మరీముఖ్యంగా వృద్దులు, చిన్నారులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.