
ప్రభుత్వ పాఠశాలకు, ప్రైవేటు స్కూల్‌కి తేడా ఇదే
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు తేడాను వివరిస్తూ నెల్లూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి భవ్య శ్రీ రూపొందించింది. ఈ వీడియోను ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గణనీయమైన మెరుగుదలను భవ్యశ్రీ చక్కగా చెప్పిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.