Good Friday 2022 : శత్రువులను కూడా ప్రేమతో క్షమించాలి.. ఇదే గుడ్ ఫ్రైడే సందేశం...
యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు.
యేసుక్రీస్తు సిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. చాలామంది తెలియని వారు గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ అంటే శుభం అని ఉండటమే. వాస్తవానికి గుడ్ ఫ్రైడ్ అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టాడని చెబుతారు. జీసస్‌ను సిలువపై వ్రేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం, లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవున్ని తలచుకుంటారు. ప్రార్థనలో గడుపుతారు.