
మూడేళ్లలోనే అమరావతి కట్టేస్తాం.. మళ్లీ మోదీనే ప్రారంభిస్తారు: చంద్రబాబు
ప్రతి ఒక్కరూ ‘నా రాజధాని’ అని గర్వించేలా అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రాజధాని నిర్మిస్తామని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ది తమ సిద్ధాంతమని తెలిపారు. రాజధాని పనుల పున: ప్రారంభమే కాదు... రాజధాని ప్రారంభోత్సవం కూడా మోదీ చేతుల మీదుగానే చేస్తామన్నారు. మోదీ నాయకత్వంలో బలమైన భారత్ ఆవిష్కృతం అవుతుందని, ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదుగుతోందన్నారు.