Yuvasamrat Akkineni Naga Chaitanya Thandel Movie: చేపల పులుసు వండిన చైతు.. టేస్ట్ ఎలా ఉందంటే

Share this Video

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం తండేల్. ఈ సినిమాలో సాయి పల్లవి చైతు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే ఊపందుకున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో సాగింది. కాగా, ఈ సినిమా షూటింగ్ సమయంలో విశాఖ స్టైల్‌లో చేపల పులుసు వండి పెడతానని మాట ఇచ్చిన నాగ చైతన్య.. తన ప్రామిస్‌ని నెరవేర్చాడు. స్వయంగా గరిట తిప్పి చేపల పులుసు వండి వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియోని తాజా విడుదల చిసింది చిత్ర నిర్మాణ సంస్థ.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video