
YSRCPని నాశనం చేయాలన్నదే బాబు లక్ష్యం.. అందుకే అరెస్టులు: భూమన కరుణాకర్ రెడ్డి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ఆర్‌సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని విమర్శించారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేయడమన్నారు.