
AP Budget 2025: అందుకే అసెంబ్లీకి వెళ్లట్లేదు: వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరొకటి కాదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు వచ్చాక ఆదాయం తగ్గిందని.. రాష్ట్ర సొంత ఆదాయం ఎస్‌ఓఆర్ పెరగలేదని చెప్పారు. మూల ధన వ్యయం కూడా దారుణంగా తగ్గిందన్నారు. ఇలాంటి పరిస్థితులున్నా, చంద్రబాబు జీఎస్‌డీపీ 12.94 శాతం నమోదు అవుతుందని చెబుతున్నారని.. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వాస్తవాలు ఇలా ఉంటే, ఈ ఏడాది బడ్జెట్ రూ.3,22,359 కోట్లు ఎలా సాధ్యమని నిలదీశారు.