
AP Assembly Budget I విద్యార్థులకు గుడ్‌న్యూస్, అప్పటి నుంచి అమల్లోకి తల్లికి వందనం, రూ.31 వేలకోట్ల
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సభలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనుండగా.. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. ఇందులో భాగంగా ముందుగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రతులకు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలిసి శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. సీఎం చంద్రబాబును కలిసి బడ్జెట్ ప్రతులను అందజేశారు. అనంతరం కెబినెట్ భేటీలో బడ్జెట్టుకు ఆమోదం తెలిపారు.