
కూటమిలో కుమ్ములాటలు.. కారణమేంటి? Adoni Revolt & Kurnool Chaos
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పార్టీల మధ్య విభేదాలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా టీడీపీ-బీజేపీ మధ్య అంతర్గత పోటీ తీవ్రంగా పెరుగుతోంది. ఆదోనిలో జరిగిన సమావేశంలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే పార్థసారధిపై నేరుగా తిరగబడటం రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే, కర్నూలులో మరో భేటీ ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడ గెస్ట్ హౌస్ కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. అసలు ఈ గొడవకు కారణమేంటి?