గాడిదను కూడా ఆవు అని నమ్మించే రకం కేసీఆర్..: వైఎస్ షర్మిల
భూపాలపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాడిదను కూడా ఆవు అని నమ్మించే సమర్ధుడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు.
భూపాలపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాడిదను కూడా ఆవు అని నమ్మించే సమర్ధుడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ఎన్నికలు వచ్చాయంటేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తుకు వస్తారని... ఆయన ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చాడంటే ఓట్లు వచ్చాయని అర్థమని అన్నారు. మాయమాటలతో ఓట్లేయించుకుని గెలిచాక తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లాడంటే మళ్లీ తిరిగిచూడటం వుండటం... 'ఏరుదాటేవరకే ఓడ మల్లన్న... ఏరు దాటాక బోడి మల్లన్న' అన్నట్లు కేసీఆర్ తీరు వుంటుందన్నారు.
షర్మిల పాదయాత్ర ప్రస్తుతం భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలతో మాటా ముచ్చట నిర్వహించిన షర్మిల స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణా రెడ్డి పైనా విరుచుకుపడ్డారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా సంపాదించడమే పనిగా పెట్టుకున్నాడని అన్నారు. ఓట్లేసి గెలిపించిన ఏ ఒక్కరినైనా ఎమ్మెల్యే ఆదుకున్నాడా... కష్టాలున్నాయని అడిగితే కనీసం పలకరించిండా... ఇలాంటి వారిని ఎందుకు ఎన్నుకోవాలి అని నిలదీసారు. ఇలాంటి పాలకులను నిలదీయడానికే రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తోందని షర్మిల అన్నారు.