Asianet News TeluguAsianet News Telugu

గులాబీలు... మరి కేటీఆర్ కూడా భార్యకు విడాకులిస్తాడా..?: షర్మిల సంచలనం

హైరదాబాద్ : ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ తిరిగి తెలంగాణలో పెత్తనం చేయాలనుకుంటున్నారంటూ తనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు  వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

First Published Dec 2, 2022, 4:42 PM IST | Last Updated Dec 2, 2022, 4:42 PM IST

హైరదాబాద్ : ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ తిరిగి తెలంగాణలో పెత్తనం చేయాలనుకుంటున్నారంటూ తనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలు  వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ వ్యక్తిని పెళ్లిచేసుకున్నా తాను ఆంధ్రా బిడ్డనయితే మరి మీ నాయకుడు కేటీఆర్ భార్య ఎవరు? ఆంధ్రా బిడ్డ కాదా? ఆమె ఇక్కడి బిడ్డగానే బ్రతకడం లేదా? అంటూ షర్మిల ప్రశ్నించారు.  విడాకులంటూ మాట్లాడున్నారే... నిజంగానే విడాకులు ఇవ్వాల్సివస్తే కేటీఆర్ కూడా ఆయన భార్యకు విడాకులు ఇవ్వాలి కదా అన్నారు. మీకో న్యాయం... పక్కనోడికి మరో న్యాయమా... మీరు చేస్తే సంసారం.. పక్కనోడు చేస్తే వ్యభిచారమా? అని అడిగారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడి వ్యక్తినే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే ఇద్దరు బిడ్డల్ని కన్నా, నా గతం, భవిష్యత్, బ్రతుకు ఇక్కడే అని షర్మిల అన్నారు. తెలంగాణ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు బాద్యత కూడా అంటూ టీఆర్ఎస్ నాయకులకు షర్మిల కౌంటరిచ్చారు. ఇక మహాప్రస్థాన పాదయాత్రలో షర్మిల  నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నారన్న టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపైనా షర్మిల స్సందించారు. మీ నాయకుడు కేసీఆర్ బూతుపురాణం ఒక్కసారి వినండి గులాబీలు అంటూ వివిధ సందర్భాల్లో కేసీఆర్ వాడిన బూతులకు సంబంధించిన వీడియోను షర్మిల ప్లే చేసారు.