గాడిదను కూడా ఆవని నమ్మించే పక్కా మోసగాడు కేసీఆర్...: వైఎస్ షర్మిల సంచలనం

కొడంగల్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత దళిత ముుఖ్యమంత్రి నుండి దళిత బంధు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మాట మోసపూరితమేనని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు.

First Published Aug 11, 2022, 3:00 PM IST | Last Updated Aug 11, 2022, 3:00 PM IST

కొడంగల్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత దళిత ముుఖ్యమంత్రి నుండి దళిత బంధు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి మాట మోసపూరితమేనని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మించగల సత్తా కేసీఆర్ కు వుందని... ఆయన ముఖ్యమంత్రి కాదు పక్కా మోసగాడని మండిపడ్డారు. కేసీఆర్ పాలనను దొంగల రాజ్యం... దోపిడీ దారులు రాజ్యం అంటూ షర్మిల మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో  పాదయాత్ర చేపడుతున్న షర్మిల కోస్గి మండలం సర్జఖాన్ పేటలో జెండా ఎగరేసిన ప్రజలతో మాట్లాడారు. కేసీఅర్ 8 ఏళ్ల పాలనంతా గారడేనని... ఈ ప్రభుత్వ పాలనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. రెండుసార్లు కేసీఅర్ కు ఓటేసి మోసపోయింది చాలు... మరోసారి ఆ పని చేయకండని సూచించారు. ఈసారి ఆలోచించి వైఎస్సార్ టిపికి ఓటేసి గెలిపించాలని... పార్టీ అధికారంలోకి రాగానే మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీద పెడతానని షర్మిల హామీ ఇచ్చారు.