Asianet News TeluguAsianet News Telugu

బిఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి..: వైఎస్ షర్మిల ఎద్దేవా

వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.

First Published Nov 27, 2022, 12:18 PM IST | Last Updated Nov 27, 2022, 12:18 PM IST

వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఇటీవలే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి టీఆర్ఎస్ పార్టీని కాస్త బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) ను బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ ఎద్దేవా చేసారు. ఒకప్పుడూ స్కూటర్ పై తిరిగిన కేసీఆర్ ఇప్పుడు విమానాలు కొంటున్నాడని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్నది చాలదన్నట్టు ఇప్పుడు దేశాన్ని దోచుకోడానికి సిద్దమయ్యాడని షర్మిల ఆరోపించారు.

ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఇటీవల భారీ వర్షాల కారణంగా నర్సంపేటలో జరిగిన పంట నష్టం గురించి ఆమె ప్రస్తావించారు. పంటనష్టం జరిగి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు హెలికాప్టర్ తో తిరిగడమే తప్ప నయాపైసా ఇచ్చిందిలేదన్నారు.  తెలంగాణ సంపదంతా కేసీఆర్ ఇంట్లోకే తప్ప పేదవాడి ఇంటికి రావడం లేదని అన్నారు.