Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట..: షర్మిల సెటైర్లు

భూపాలపల్లి : మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట...

First Published Nov 24, 2022, 1:44 PM IST | Last Updated Nov 24, 2022, 1:44 PM IST

భూపాలపల్లి : మన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటోడు పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందట... అలాగే వుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ తీరు అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేసారు. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే మూడేళ్లు కూడా కాకుండానే మునిగిపోయిందన్నారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవాదుల ప్రాజెక్ట్ కట్టి 15 ఏళ్లు అయినా ఇంతవరకూ చెక్కుచెదరలేదు... ఎన్నో వరదలను తట్టుకుని నిలబడిందన్నారు. దేవాదుల కమీషన్ల కోసం కట్టింది కాదు, నాసిరకం పనులు జరగలేదు కాబట్టే నాణ్యతతో ఈరోజు వరకు నిలబడిందన్నారు. ఇక కేసీఆర్ కాళేశ్వరం కట్టిందే కమీషన్ల కోసమే కాబట్టి ఇలా నాణ్యత లోపించిందన్నారు. గతంలో వైఎస్సార్ 38వేల కోట్లతో పూర్తిచేయాలనుకున్న ప్రాజెక్టును కేసిఆర్ లక్షా 20వేల కోట్లతో పూర్తిచేసారని... కళ్లముందే రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు ఉద్యమకారుడు ముదిరి ఊసరవెల్లి ముఖ్యమంత్రి అయ్యారంటూ షర్మిల ఎద్దేవా చేసారు. కేసీఆర్ కాస్త కల్వకుంట్ల కమీషన్ల రావు అయ్యారంటూ వైఎస్ షర్మిల సెటైర్లు వేసారు.