కేసీఆర్ పాలనలో నాణ్యత నవ్వులపాలు... నిధులు కమీషన్ల పాలు : షర్మిల సెటైర్లు
కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి అవినీతి ఆరోపణలు చేసారు.
కరీంనగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి అవినీతి ఆరోపణలు చేసారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుందంటూ ఆరోపిస్తూ ఆరోపించడమే కాదు కేంద్ర దర్యాప్తు సంస్థలకు షర్మిల ఫిర్యాదులు కూడా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ సర్కార్ పాలనలో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందంటూ షర్మిల మండిపడ్డారు. ''కేసీఆర్ పాలనలో నాణ్యత నవ్వులపాలు... నిధులు కమీషన్ల పాలు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా నా తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నిర్మించిన బ్రిడ్జిపై ప్రయాణించాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఆనాటి బ్రిడ్జ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు కానీ కేసీఆర్ నిర్మించిన రోడ్డు మాత్రం వరదలో కొట్టుకుపోయింది'' అంటూ పూర్తిగా దెబ్బతిన్న రోడ్డులో తాను ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియోను షర్మిల షేర్ చేసారు.