దిక్కుమాలిన మంత్రిది ప్రజాసంక్షేమం కాదు సొంత సంక్షేమం..: కొప్పులపై షర్మిల ధ్వజం

కరీంనగర్ : తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

First Published Nov 14, 2022, 11:08 AM IST | Last Updated Nov 14, 2022, 11:08 AM IST

కరీంనగర్ : తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహాప్రస్థాన యాత్రలో భాగంగా ప్రస్తుతం ధర్మపురి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న షర్మిల మంత్రి దత్తత గ్రామం చామనపల్లిలో ప్రసంగించారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి అసలేం ఉద్దరించాడు... మీకు ఏదయినా మంచి చేసాడా అంటూ గ్రామస్తులను అడిగారు. ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగం, నిరుద్యోగ భృతి వచ్చిందా..? రుణమాఫీ అయ్యిందా? ఒక్కమాటయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ అంటూ షర్మిల ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ కొప్పులో సంక్షేమ మంత్రిపదవి వుంది... కానీ ఆయన ప్రజల సంక్షేమం కాకుండా సొంత సంక్షేమం చూసుకుంటున్నాడు అని షర్మిల ఆరోపించారు. ఈ దిక్కుమాలిన మంత్రికి డబ్బులు సంపాదించుకోవడమే సరిపోయింది... అలాంటి వ్యక్తికి మంత్రిపదవి ఎందుకు? అని అన్నారు. కనీసం తన సామాజికవర్గీయులు దళితులకోసమైనా ఏమైనా చేసారా..? దళిత బంధు కాస్త అనుచర బంధు చేసారని మండిపడ్డారు. ఈ సారి ఎన్నికల్లో ఈ దళిత మంత్రికి కర్రుకాల్చి వాత పెట్టాలని షర్మిల సూచించారు.