Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని గారు... తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ సంగతేంటో తేల్చండి : షర్మిల డిమాండ్

పెద్దపల్లి :  తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి గురించి స్పందించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేసారు. 

First Published Nov 12, 2022, 1:07 PM IST | Last Updated Nov 12, 2022, 1:07 PM IST

పెద్దపల్లి :  తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి గురించి స్పందించాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల డిమాండ్ చేసారు. తెలంగాణలో ప్రధాని పర్యటనను స్వాగతిస్తున్నామని... ఇదే క్రమంలో భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి స్పందించాలని కోరుతున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సెంట్రల్ ఫైన్సాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచే లక్షకోట్లు వచ్చాయని... ఇందులో భారీ కుంభకోణం జరిగితే మీరే కాపలా కుక్కుగా వుండాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించారు.రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి మీకు, మీ పార్టీవారికి తెలుసన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ కాళేశ్వరంను సీఎం కేసీఆర్ ఏటిఎంలా వాడుకుంటున్నారని అంటున్నారు... అయినా మీరేందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ షర్మిల అడిగారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు, భారీ కుంభకోణంపై దర్యాప్తు జరపాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ కోరుతోందని షర్మిల అన్నారు. కాళేశ్వరంతో పాటు కేసీఆర్ పాలనలో జరిగిన 
అవినీతి, అక్రమాల గురించి వైఎస్సార్ టిపి పోరాడుతోందన్నారు. మేమింత కొట్లాడుతుంటే ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ గాడిదలు కాస్తున్నారా... గుడ్డిగుర్రాలకు పండ్లు తోముతున్నారా అంటటూ మండిపడ్డారు. మీరు కూడా మీ వాటాలు తీసుకున్నారా... తీసుకోలేదంటే మాతో కలిసి పోరాడండి అని షర్మిల కోరారు.