జపాలలో సాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర...
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా నేడు జపాల్ లో పర్యటించారు. జపాల్ గ్రామం కిరాణం షాప్ ను పరిశీలించి కాసేపు ముచ్చటించారు. మంచాల మండలం జపల్ గ్రామంలో ప్రజలు తమ సమస్యలను వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలకు వివరించారు. కుమ్మరి కులస్తుడు లింగమయ్య తనకు కుండలు చేసేందుకు యంత్రం కావాలని తెలిపారు. కుమ్మరి వారి ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని మీరు వస్తే మళ్లీ వైఎస్ఆర్ పాలన వస్తుందని అన్నారు.