Asianet News TeluguAsianet News Telugu

నాపై కోడిగుడ్లు కాదు బాంబులేసినా భయపడ..: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షర్మిల వార్నింగ్

వికారాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తనపై కోడిగుడ్లు వేయించి అవమానించాలని చూస్తున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు. తన గురించి మాట్లాడితే షర్మిలను గుడ్లతో కొట్టాలని తన మనుషులకు ఎమ్మెల్యే చెప్పాడట... ఎక్కడున్నారయ్యా మీరు అంటూ షర్మిల సెటైర్లు వేసారు.

First Published Sep 22, 2022, 4:53 PM IST | Last Updated Sep 22, 2022, 4:53 PM IST

వికారాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తనపై కోడిగుడ్లు వేయించి అవమానించాలని చూస్తున్నాడని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలిపారు. తన గురించి మాట్లాడితే షర్మిలను గుడ్లతో కొట్టాలని తన మనుషులకు ఎమ్మెల్యే చెప్పాడట... ఎక్కడున్నారయ్యా మీరు అంటూ షర్మిల సెటైర్లు వేసారు. అయితే ఈ గుడ్లకు బయపడేవారు ఎవ్వరూ లేరని... 
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నిరుద్యోగ కోసం నిరాహారదీక్ష చేస్తూ సీఎం కేసీఆర్ బట్టలు చింపించి, చేయి విరగ్గొట్టించినా వెనక్కి తగ్గలేదని ఈ ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలన్నారు. గుడ్లేసినా, రాళ్లేసినా, చెప్పులేసినా చివరకు బాంబులేసినా బెదిరేది లేదని షర్మిల అన్నారు.  

మా ఎమ్మెల్యే ఎందుకూ పనికిరాడని పరిగి జనమే అంటున్నారని షర్మిల అన్నారు. గత ఎన్నికల సమయంలో రోడ్లు వేయిస్తానని ఓట్లేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే... ఇప్పుడు అడిగితే సంక్షేమ పథకాలు వదులుకుంటే రోడ్లు వేయిస్తానంటున్నాడట. అయినా ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చుచేయడంలో నీ బోడి పెత్తనమేంటి ఎమ్మెల్యే... సోయి లేకుండా తిక్కతిక్క మాటలు మాట్లాడుతున్నావంటూ పరిగి ఎమ్మెల్యేపై షర్మిల పైర్ అయ్యారు.