బెల్లంపల్లి ఎమ్మెల్యే పేరుకే చిన్నయ్య...అవినీతిలో చాలా పెద్దోడు: షర్మిల సెటైర్లు

మంచిర్యాల : మీ ఎమ్మెల్యే పేరుకే దుర్గం చిన్నయ్య...అవినీతి, భూకబ్జాలు చేయడంలో చాలా పెద్దమనిషటకదా..

First Published Nov 7, 2022, 1:27 PM IST | Last Updated Nov 7, 2022, 1:27 PM IST

మంచిర్యాల : మీ ఎమ్మెల్యే పేరుకే దుర్గం చిన్నయ్య...అవినీతి, భూకబ్జాలు చేయడంలో చాలా పెద్దమనిషటకదా.. అంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యేపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి తీవ్ర విమర్శలు చేసారు.  చివరకు సింగరేణి భూములను కూడా ఈ ఎమ్మెల్యే కబ్జా చేసాడట కదా... అంటూ బెల్లంపల్లి ప్రజలను అడిగారు. ప్రభుత్వ భూములు కూడా వదలకుండా కబ్జాచేసి జెండా పాతేస్తాడటగా... ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి తన వాటా తీసుకుంటాడటగా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు చేసారు. ఇలా అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించడటగా... ఎవరయినా ప్రశ్నిస్తే బండబూతులు తిడుతూ చంపేస్తానని బెదిరిస్తాడగా మీ ఎమ్మెల్యే అని బెల్లంపల్లి ప్రజలను షర్మిల అడిగారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ... బయట ఎమ్మెల్యే చిన్నయ్య గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారని అన్నారు. స్వయంగా దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే చివరకు దళిత బంధులో కూడా రూ.3లక్షలు కమీషన్ అడుగున్నాడగా అని అన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను ఈసారి ఉపేక్షించకూడదని... ఈసారి ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలని షర్మిల సూచించారు.