Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ను మించిన 420, మెగా మోసగాళ్లు తెలంగాణలోనే లేరు..: వైఎస్ షర్మిల

ధర్మపురి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కా 420 లు అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు.

First Published Nov 4, 2022, 11:42 AM IST | Last Updated Nov 4, 2022, 11:42 AM IST

ధర్మపురి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కా 420 లు అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నిక మోసగాళ్లు, మొనగాళ్లకు మధ్య జరుగుతుందని కేసీఆర్ అంటున్నారు... అసలు ఎవరు మోసగాళ్లు... ఎవరు మొనగాళ్లు? అని ప్రశ్నించారు. బిజెపి నాయకులు మోసగాళ్లు సరే మరి మీరేమిటి? మోసగాళ్లు కాదా...దళిత ముఖ్యమంత్రి, రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాలు భూమి, ఇంటికో ఉద్యోగం హామీలను మరిచి తెలంగాణ ప్రజలను నిండా ముంచిన కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మెగా మోసగాళ్లని మండిపడ్డారు. వీరిని మించిన 420 లు తెలంగాణ రాష్ట్రంలోనే లేరని షర్మిల ధ్వజమెత్తారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా షర్మిల పాదయాత్ర ధర్మపురి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ   ధర్మపురి ప్రజలకు వివరించారు. కమీషన్ల కోసం రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటిని మెగా కంపనీకి కట్టబెడుతున్న మీరుకదా మెగా మోసగాళ్లు... ఇంకా ఎంతమందిని ముంచుతారంటూ నిలదీసారు. ఇప్పుడు ఓట్లేసి గెలిపిస్తేనే మునుగోడును అభివృద్ది చేస్తారట... ఏం ఈ ఎనిమిది సంవత్సరాలు గాడిదలు కాసారా? అంటూ షర్మిల ధ్వజమెత్తారు.