Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ... వైఎస్సార్ బిడ్డగా ఇదే నా సవాల్..: వైఎస్ షర్మిల

మహబూబ్ నగర్ :  మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.

మహబూబ్ నగర్ :  మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో వున్న వ్యక్తి మహిళను పట్టుకుని మరదలు అంటే తప్పులేదట... కానీ ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పొచ్చిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళ ఒంటరిగా వస్తే ఎదుర్కోలేని పిరికిపందలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 14మంది ఎమ్మెల్యేలే... అందుకే కట్టగట్టుకుని వెళ్లి తనపై స్పీకర్ కు పిర్యాదు చేసారని మండిపడ్డారు. తనపై ఫిర్యాదు చేయడానికి చూపించిన ఈ ఐక్యత పాలమూరు జిల్లా కోసం వుంటే బావుండేదని ఎద్దేవా చేసారు.  తనపై ఫిర్యాదుచేసిన ఎమ్మెల్యేలకు సిగ్గుండాలంటూ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా జడ్చర్ల రోడ్ షో లో ప్రసంగిస్తూ పాలమూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షర్మిల సవాల్ విసిరారు. మీరు నిజంగానే పాలమూరు బిడ్డలయితే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం కొట్లాడాలి.. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఇదే నా సవాల్ అని షర్మిల అన్నారు.