నువ్వది నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా... లేదంటే రాజీనామాకు సిద్దమా? : పోచారంకు షర్మిల సవాల్
నిజామాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
నిజామాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరిగినంత అభివృద్ది ఎక్కడా లేదంటున్న పోచారంకు సొంత నియోజకవర్గం బాన్సువాడలోనే ప్రజా సమస్యలను చూపిస్తానన్నారు. మీకు దమ్ముంటే ఒక్కరోజు తనతో కలిసి పాదయాత్ర చెయాలని... ఆయన నిజంగానే అభివృద్ది చూపిస్తే ముక్కు నేలకు రాసి పాదయాత్ర ఇక్కడితో ఆపేసి క్షమాపనలు చెప్పి ఇంటికి వెళతానని... తాను సమస్యలు చూపిస్తే మీ స్పీకర్ పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అంటూ పోచారంకు షర్మిల సవాల్ విసిరారు.
బాన్సువాడ నియోజకవర్గంలో షర్మిల మహాప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి బాన్సువాడ కాస్త బానిసవాడ అయ్యిందని... ఇక్కడ ప్రజలమంతా బానిసలమయ్యామని... ఎమ్మెల్యే స్పీకర్ అయ్యాడు.. ఆయన కొడుకులిద్దరు ఎమ్మెల్యేలయ్యారు... ఆస్తులు రాసిచ్చినట్లు కొడుకులకు ఎమ్మెల్యే పదవి రాసిచ్చారు... ముగ్గురు దొరలు, వారి అనుచరుల అరాచాల మధ్య బ్రతుకుతున్న మావి బానిస బ్రతుకులు కాకుంటే ఇంకేటని అన్నాడని షర్మిల పేర్కొన్నారు.