Asianet News TeluguAsianet News Telugu

రైతుకూలీగా మారి పత్తి ఏరిన వైఎస్ షర్మిల

మహబూబ్ నగర్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు.

First Published Sep 13, 2022, 11:58 AM IST | Last Updated Sep 13, 2022, 11:58 AM IST

మహబూబ్ నగర్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలను తెలుసుకుంటున్నారు. ఇలా మహబూబ్ నగర్ జిల్లాను కాలినడకన చుట్టేస్తున్న షర్మిల మహిళా కూలీల కష్టాన్ని స్వయంగా అనుభవించారు. వెంకటగిరి గ్రామ శివారులోని ఓ పొలంలో పత్తి సేకరిస్తున్న మహిళలను చూసిన షర్మిల వారివద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. మహిళా కూలీలతో కలిసి పత్తి ఏరి వారి కష్టం ఎలావుంటుందో స్వయంగా తెలుసుకున్నారు.