ఖబర్దార్ కేసీఆర్... మా జోలికొస్తే చెప్పులు, రాళ్లతో కొట్టడం ఖాయం: షర్మిల మాస్ వార్నింగ్
ధర్మపురి : మహాప్రస్థాన యాత్ర పేరిట తాను చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
ధర్మపురి : మహాప్రస్థాన యాత్ర పేరిట తాను చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార టీఆర్ఎస్ యత్నిస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇందులో భాగంగానే చామనపల్లిలో రాత్రి బస చేసే ప్రాంతంలో టీఆర్ఎస్ శ్రేణులు విధ్వంసం సృష్టించారని... పాదయాత్ర ఫ్లెక్సీలు చించడమే కాదు నాయకులను కొట్టారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. టీఆర్ఎస్ నాయకులు చేతకాని దద్దమ్మలు కాబట్టే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేక దాడులు చేయిస్తున్నారని అన్నారు. మాది పార్టీయే కాదన్నవారు ఇప్పుడు భయపడి దాడులు చేయించడమెందుకు? మాకు ప్రజల్లో ఆదరణే లేదని ఇప్పుడు భుజాలు తడుముకోవడం ఎందుకు? అని షర్మిల ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జోలికివస్తే ఆయన అభిమానుల సహించరని షర్మిల హెచ్చరించారు. వైఎస్సార్ పథకాలతో లబ్దిపొందిన వారు ఆయనను గుండెల్లో, ఫోటోలను దేవుడి గదిలో వుంచుకున్నారన్నారు. కాబట్టి ఇంకోసారి వైఎస్సార్ ప్లెక్సీలు, విగ్రహాల జోలికి వస్తే ప్రజలే రాళ్లు, చెప్పులతో దాడిచేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నాని అన్నారు. ప్రజలకోసం పనిచేస్తారని అధికారాన్ని కట్టబెడితే కనీసం సిగ్గులేకుండా ప్రజల పక్షాన నిలబడిన వారిపై దాడులు చేయిస్తారా అంటూ షర్మిల మండిపడ్డారు.