నేను పులి బిడ్డను... దమ్ముంటే అరెస్ట్ చేసి చూడు కేసీఆర్: వైఎస్ షర్మిల

హైదరాబాద్ : ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

First Published Sep 18, 2022, 12:57 PM IST | Last Updated Sep 18, 2022, 12:57 PM IST

హైదరాబాద్ : ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మంత్రి నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో షర్మిలపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు అరెస్టుకు సిద్దమయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలోనే మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ షర్మిల సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ చేసారు. భేడిలంటే భయం లేదు... మీకు చేతనైతే అరెస్ట్ చేయండన్నారు. భేడీలను పట్టుకుని మీడియాతో మాట్లాడారు షర్మిల. ''నా పేరు వైఎస్ షర్మిల.. నేను వైఎస్సార్ బిడ్డని. నాపై కేసులు పెట్టారు కదా... అరెస్ట్ చేయండి చూద్దాం. నేను పులి బిడ్డను... ఈ బేడిలకు భయపడేదాన్ని కాదు. మీతో పోలీస్ లు ఉంటే..నాతో జనం ఉన్నారు. గుర్తుపెట్టుకో కేసీఅర్'' అంటూ షర్మిల హెచ్చరించారు.