Asianet News TeluguAsianet News Telugu

ఎవడ్రా నాది తెలంగాణ కాదని కూసేది..: వైఎస్ షర్మిల సీరియస్

మహబూబ్ నగర్ : వైఎస్సార్ తెలంగాణ ఆంధ్రా పార్టీ అంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

First Published Sep 12, 2022, 11:09 AM IST | Last Updated Sep 12, 2022, 11:09 AM IST

మహబూబ్ నగర్ : వైఎస్సార్ తెలంగాణ ఆంధ్రా పార్టీ అంటూ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ తెలంగాణ గడ్డపైనే పెరిగా, ఈ తెలంగాణ గాలి పీల్చుకుంటూని బ్రతికా, ఈ తెలంగాణ కూడే తిన్నా, బిడ్డల్ని ఇక్కడే కన్నా... ఇలా బ్రతుకంతా ఇక్కడే అయినప్పుడు తెలంగాణకు సేవచేయడం తన హక్కు అని అన్నారు. అందుకే అందుకే ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని... ఈ ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చినట్లు షర్మిల స్పష్టం చేసారు. వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ సభలో షర్మిల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తో పాటు స్థానిక మంత్రి నిరంజన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నాది తెలంగాణ కాదనేది ఎవడ్రా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకురావాలనే రాజకీయాలు చేస్తున్నానని షర్మిల అన్నారు.