స్కూటర్ పై తిరిగినోడు విమానాలు, జాతీయ పార్టీలా.. కేసీఆర్ అవినీతికిదే పరాకాష్ట : వైఎస్ షర్మిల
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు.
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేవలం ఓట్ల కోసమే కేసీఆర్ సార్ బయటికొస్తాడు... మంచి మంచి గారడి మాటలు చెప్పి ఓట్లు గుద్దించుకుని మళ్లీ తిరిగిచూడడని అన్నారు. ప్రజల సొమ్ముతో విమానాలు, హెలికాప్టర్లు కూడా కొంటున్నాడు... జాతీయ పార్టీ పెట్టే స్థాయిలో డబ్బులు వచ్చాయంటే కేసీఆర్ ఏ స్థాయిలో తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాడో అర్థమవుతుందన్నారు. స్కూటర్ పై తిరిగేటోడికి ఇంత డబ్బు ఎక్కడినుండి వచ్చింది.. ప్రజల సొమ్మే కదా.... తెలంగాణ ఖజానాను కొల్లగొడితే వచ్చిన డబ్బే కదా అన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ రూ.70వేల కోట్లు దోచుకున్నారని షర్మిల ఆరోపించారు. ఈ అవినీతి గురించి ప్రతిపక్షాలు బిజెపి, కాంగ్రెస్ కు తెలిసినా ప్రశ్నించవన్నారు. బిజెపి జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కాళేశ్వరంను కేసీఆర్ ఏటింఎంలా వాడుకుంటున్నాడు అంటారు... కానీ ఈ అవినీతిపై సిబిఐతోనో, ఈడి తోనో విచారణ చేయించరన్నారు. రేవంత్ ఒక అమ్ముడుబోయే ఆయన... ఒక దొంగ... ఆయనకు ఇన్ని డబ్బులిస్తూ నోరు మూసుకుని వుంటాడని ఆరోపించారు. కేసిఆర్ అవినీతి, అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది వైఎస్సార్ తెలంగాణ పార్టీ, రాజశేఖర్ రెడ్డి బిడ్డేనని షర్మిల అన్నారు.