క్లౌడ్ బరస్ట్ కాదు... కేసీఆర్ ఇంజనీరింగ్ వల్లే కాళేశ్వరం మునక : షర్మిల సెటైర్లు

పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే ఇంజనీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని... అందువల్లే ఇటీవల భారీ వర్షాలతో గోదావరిలో ఆ ప్రాజెక్ట్ మునిగిపోయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు.

First Published Jul 22, 2022, 5:18 PM IST | Last Updated Jul 22, 2022, 5:18 PM IST

పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే ఇంజనీర్ గా మారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని... అందువల్లే ఇటీవల భారీ వర్షాలతో గోదావరిలో ఆ ప్రాజెక్ట్ మునిగిపోయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేవలం ఇంజనీరే కాదు సైంటిస్ట్, డాక్టర్,  అపర మేధావిలా కేసీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేసారు. తన నిర్వాకం గురించి ప్రజలకు తెలియకూడదనే వారి దృష్టి మరల్చడానికి క్లౌడ్ బరస్ట్, మేఘ మధనం అంటూ అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారని షర్మిల అన్నారు.

ఇటీవల భారీ వర్షాలతో గోదావరి ఉప్పొంగి పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో శుక్రవారం షర్మిల పర్యటించారు. ఇలా పెద్దపల్లి జిల్లా మంథని నియోజకర్గంలో గోదావరి వరదలతో మునకకు గురయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కేసీఆర్ కు పరిపాలన చేతకాదని... ప్రజలను పట్టించుకోని ఈ సీఎం వుంటే ఎంత లేకుంటే ఎంత అని షర్మిల మండిపడ్డారు.