Asianet News TeluguAsianet News Telugu

జగ్గయ్యా... రోజుకో పార్టీ మారే నువ్వా నా గురించి మాట్లాడేది..: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై షర్మిల సెటైర్లు

సంగారెడ్డి : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై విరుచుకుపడ్డారు.

First Published Sep 26, 2022, 3:14 PM IST | Last Updated Sep 26, 2022, 3:14 PM IST

సంగారెడ్డి : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై విరుచుకుపడ్డారు. అసలు మీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏ పార్టీలో వున్నాడో తెలుసా? అని సంగారెడ్డి ప్రజలను ప్రశ్నించారు. మొదట టీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్, మధ్యలో బిజెపి, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్... ఇలా రోజుకో పార్టీ మారే జగయ్య గారు నా గురించి, వైఎస్సార్ టిపి గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, తెలంగాణ కొడలిగా పార్టీపెడితే తాను బిజెపి వదిలిన బాణమని జగ్గయ్య గారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. అయితే నేను ఎవరో వదిలిన బాణం కాదు.... రాజశేఖర్ రెడ్డి బిడ్డను...  వైఎస్సార్ వదిలిన బాణాన్ని అని షర్మిల పేర్కొన్నారు. మహా ప్రస్థాన పాదయాత్రలో భాగంగా సంగారెడ్డికి చేరుకున్న షర్మిల రోడ్ షో లో మట్లాడారు.  ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో తన గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటూ కౌంటరిచ్చారు. వైఎస్సార్ టిపి గురించి కాదు ఓ దొంగను అధ్యక్షుడిగా పెట్టుకున్న మీ కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకోండి జగ్గారెడ్డి గారు అంటూ షర్మిల సెటైర్లు వేసారు.