దళిత సీఎం నుండి దళిత బంధు వరకు అన్నీ మోసాలే... కేసీఆర్ ఓ మోసకారి : షర్మిల ధ్వజం
నాగర్ కర్నూల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారే కాదు మోసకారి కూడా అని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు.
నాగర్ కర్నూల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటకారే కాదు మోసకారి కూడా అని వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ఇక బిజెపి మతపిచ్చి, కాంగ్రెస్ లో అమ్ముడుపోయే నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... అందువల్లే ప్రజలకోసమే వైఎస్సార్ టిపి పార్టీ పెట్టినట్లు షర్మిల తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సాగుతున్న మహాప్రస్థాన పాదయాత్ర సందర్భంగా షర్మిల టీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై ధ్వజమెత్తారు.
అధికారంలో వున్న ఈ ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ చేసిందంతా మోసమేనని... ఆయనిచ్చిన ఒక్క హామీ అయినా అమలవుతుందా అని షర్మిల ప్రశ్నించారు. ఒకటి కాదు రెండు కాదు దళిత మఉఖ్యమంత్రి నుండి దళిత బంధు వరకు అన్నీ మోసాలేనని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మోసగాడు అనాలా లేక అబద్దాల కోరు అనాలా అంటూ మండిపడ్డారు. బిజెపి మతపిచ్చి, కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు... అందరూ అన్యాయమే చేసారు కాబట్టే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టానన్నారు. పులి కడుపున పులే పుడుతుంది... నా గుండెలో నిజాయితీ వుంది...మీకు సేవ చేయాలన్న తపన వుంది... మీరు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తానని షర్మిల హామీ ఇచ్చారు.