Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు వైఎస్సార్ బ్రతికుంటే కాంగ్రెస్ పై ఉమ్మేసేవాడు..: షర్మిల సంచలన వ్యాఖ్యలు

మెదక్ : కాంగ్రెస్ పార్టీపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు.

First Published Sep 30, 2022, 1:13 PM IST | Last Updated Sep 30, 2022, 1:13 PM IST

మెదక్ : కాంగ్రెస్ పార్టీపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పార్టీకి 30 సంత్సరాలు సేవ చేసి, రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన నాయకుడు వైఎస్సార్... అలాంటి నాయకుడికి ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. కాబట్టి ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు కాదు... నా తండ్రి మాత్రమే అన్నారు. వైఎస్సార్ బ్రతికుండగా
ఇంద్రుడు, చంద్రుడని పొగిడి చచ్చాక దోషిని చేసారు.... ఇప్పుడు మళ్లీ ఓట్లకోసం ఆయన బొమ్మ పెట్టుకున్నారు... కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి అంటూ మండిపడ్డారు. వైఎస్సార్ ఇప్పుడు బ్రతికుంటే కాంగ్రెస్ పై ఉమ్మేసేవాడని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ కు వైఎస్సార్ ఖ్యాతిని తెచ్చారు... కాగ్రెస్ ఆయనకు తేలేదని షర్మిల అన్నారు. కాంగ్రెస్ పాదయాత్ర చేయలేదు... వైఎస్సార్ పాదయాత్ర చేసారు... ఆయనను చూసే ప్రజలు ఆశీర్వదించి రెండు సార్లు అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాంటి నాయకుడు చనిపోతే కాంగ్రెస్ ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది... ఇది వెన్నుపోటు పొడవడం కాదా? అని షర్మిల నిలదీసారు. 
హెలికాప్టర్ ప్రమాదంపై సీఎం పదవిలో వున్న వైఎస్సార్ చనిపోతే కనీసం  ఎంక్వయిరీ కూడా లేదు... ఇది కాంగ్రెస్ వైఎస్సార్ కు ఇచ్చిన గౌరవం అంటూ షర్మిల మండిపడ్డారు.