ఆటోవాలాగా మారిన వైటిపి అధినేత్రి... ఖమ్మం వీధుల్లో ఆటో నడిపిన వైఎస్ షర్మిల

ఖమ్మం: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది.

First Published Jun 16, 2022, 1:33 PM IST | Last Updated Jun 16, 2022, 1:33 PM IST

ఖమ్మం: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ (గురువారం) ఖమ్మం పట్టణంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా షర్మిల ఓ అభిమాని కోరిక మేరకు ఆటో నడిపారు. ముస్తాఫా నగర్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ వేషధారణలో షర్మిల ఆటో నడపిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ట్రాక్టర్ స్టీరింగ్ పట్టిన షర్మిల ఇప్పుడు ఆటోవాలాలను ఆకట్టుకున్నారు.