మీది అధికార డబ్బు పిచ్చి... మాది ప్రజాసేవ పిచ్చి: మంత్రి గంగులకు షర్మిల కౌంటర్

కరీంనగర్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులను, తనను పిచ్చోళ్లంటూ మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మేం కాదు పిచ్చోళం...

First Published Nov 16, 2022, 10:29 AM IST | Last Updated Nov 16, 2022, 10:29 AM IST

కరీంనగర్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులను, తనను పిచ్చోళ్లంటూ మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ కు వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మేం కాదు పిచ్చోళం... అసలు పిచ్చోలు మీరే... మా కోసం పిచ్చాసుపత్రి కట్టించడం కాదు మీకే అది అవసరమన్నారు షర్మిల. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా ఏది పడితే అది దోచుకుని అధికార, డబ్బు పిచ్చి పట్టింది టీఆర్ఎస్ నాయకులేనని అన్నారు. మాకు ప్రజలకు సేవచేయాలని, ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని, ఎండలోనూ పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరే వుండాలన్ని పిచ్చి వుందన్నారు.  ప్రపంచంలో ఎక్కడయినా అధికార, డబ్బు పిచ్చిని నయంచేసే హాస్పిటల్ వుంటే అక్కడికెళ్లి నయం చేసుకోండంటూ షర్మిల ఎద్దేవా చేసారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు తప్ప ఏ ఇతర పార్టీకి స్థానం లేదంటూ మంత్రి గంగుల బుర్రలేకుండా మాట్లాడుతున్నాడని షర్మిల మండిపడ్డారు. మేము తెలంగాణలోని నీళ్లు, కరెంట్, ప్రాజెక్టులు ఎత్తుకుపోతామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ఇచ్చేవాడే తప్ప తీసుకునేవాడు కాదు... ఆయన బిడ్డగా నేనూ ఇచ్చేదాన్నేనని అన్నారు. తీసుకునేది, కబ్జాలు చేసేది,  దొంగలు, అక్రమాలు చేసేది, అవినీతి చేసేది మీరే... మీరా మాట్లాడేది అంటూ షర్మిల మండిపడ్డారు.