వైఎస్ షర్మిల హై వోల్టీజీ భేటీ... లోటస్ పాండ్ వద్ద సందడి
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల యాక్టివ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల యాక్టివ్ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోటస్ పాండ్ నివాసంలో అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు ఉభయ తెలుగురాష్ట్రాల నుండి భారీగా అభిమానులు లోటస్ పాండ్ కు చేరుకుంటున్నారు. ఈ సమావేశం అనంతరం షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం వున్నట్లు సమాచారం.