Agnipath Row : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత... రైళ్లకు నిప్పు, రాళ్లదాడి, బస్సులు ధ్వంసం

సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

First Published Jun 17, 2022, 10:48 AM IST | Last Updated Jun 17, 2022, 10:52 AM IST

సికింద్రాబాద్: కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాల నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఆందోళనలు చెలరేగాయి.  ఆర్మీ పరీక్ష కోసం వచ్చిన యువకులు రైలు పట్టాలపై బైఠాయించారు.  రైలు పట్టాల మధ్యలో పార్సల్ సామాన్లు వేసి నిప్పు పెట్టారు. సేవ్ ఆర్మీ పేరిట ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పలు రైళ్లపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ప్రయాణికులు బయటకు పరుగు తీసారు. 

ఇక రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చిన ఆందోళనకారులు ఆర్టిసి బస్సులను కూడా ధ్వంసం చేసారు. భారీగా పోలీసులు, భద్రతా సిబ్బంది సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెస్తున్నారు.