పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్... మద్యం మత్తులో వ్యక్తి హల్చల్
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ పట్టణంలో గురువారం రాత్రి తెలంగాణ చౌక్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఓ తాగుబోతు నానా బీభత్సం చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ పట్టణంలో గురువారం రాత్రి తెలంగాణ చౌక్ లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఓ తాగుబోతు నానా బీభత్సం చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి కాలేజీ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేయగా తాగిన మైకంలో ఉన్న యువకుడు ఎస్ ఐ ఖాతారు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసులు సదరు వ్యక్తిని పోలీసు వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేయగా ఆ యువకుడు ఏకంగా ఎస్ ఐ దిలీప్ గల్లా పట్టడంతో అతి కష్టం మీద ఆ యువకుని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు.